NRPT: ధన్వాడ మండలంలో అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న టిప్పర్‌ను పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. టిప్పర్ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ ఎస్సై మహేశ్వరి తెలిపారు. అక్రమ ఇసుక రవాణాపై నిరంతరం నిఘా కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
అక్రమ ఇసుక తరలిస్తున్న టిప్పర్ పట్టివేత


