హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే సాయం

బాపట్ల 3వ వార్డులో అగ్నిప్రమాదం జరిగింది. మెట్టా వెంకటేశర్లు, నాగలక్ష్మి దంపతుల ఇల్లు ప్రమాదానికి గురైంది. విషయం తెలుసుకున్న బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మ రాజు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి ఆర్థిక సాయం అందజేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు.