PDPL: ధర్మారం మండలంలోని ఓ మైనర్ బాలికపై జరిగిన లైంగికదాడి ఘటనపై పెద్దపల్లి ఏసీపీ కృష్ణ బుధవారం విచారణ చేపట్టారు. బాధితురాలు, ఆమె తండ్రితో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. అనంతరం బాధితురాలి ఇంటి సమీపంలోని వారితో మాట్లాడి వివరాలు సేకరించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఏసీపీ వెంట సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై ఎంబడి శ్రీకాంత్ ఉన్నారు.
తెలంగాణ
మైనర్ బాలిక ఘటనపై ఏసీపీ విచారణ


