హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మండపేటలో ఘనంగా విశ్వకర్మ జయంతి

కోనసీమ: మండపేటలో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో గురువారం విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడు మల్లువలస రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కోన సత్యనారాయణ, కోటిపల్లి సాయిరాం పాల్గొన్నారు. విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆయనను దివ్య శిల్పిగా కొనియాడారు.