అన్నమయ్య: రాజంపేటలోని బోయపాలెం వార్డులోని గణేష్ మండపాన్ని రాజంపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద పండితుల ఆశీర్వచనం పొందారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గణనాథుని దర్శించుకున్న చమర్తి


