హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారునికి అభినందనలు

SKLM: మార్కాపురం జిల్లాలో ఈనెల 12,13 తేదీలలో జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా టీం తృతీయ స్థానంలో నిలిచింది. ఈ టీమ్‌లో క్రీడాకారుడైన టెక్కలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి పి.దుర్గాప్రసాద్‌ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాట్ల దాసరది, వ్యాయామ ఉపాధ్యాయులు రామిరెడ్డి, జగ్గమ్మలు ఇవాళ అభినందించారు.