హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆరోగ్య కేంద్రం ఆవరణలో నీరు.. రాకపోకలకు ఇబ్బందులు

PPM: పాలకొండ పట్టణ ఆరోగ్య కేంద్రం ఆవరణలో వర్షపు నీరు నిలిచిపోవడంతో సిబ్బంది, రోగులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆవరణలో నీరు చిన్న మడుగును తలపిస్తుండటంతో దాన్ని దాటుకుని ఆరోగ్య కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజుల తరబడి ఇదే సమస్య కొనసాగుతోందని సిబ్బంది, రోగులు వాపోతున్నారు. అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.