హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సింహాద్రి అప్పన్న రూపంలో వినాయకుడు

VSP: పెందుర్తి మండలం దువ్వుపాలెంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సింహాచలం దేవస్థానం నమూనాలో మండపాన్ని ఏర్పాటు చేయగా, లోపల వినాయకుడిని సింహాద్రి అప్పన్న స్వామి ఆకారంలో ప్రతిష్ఠించారు. దీంతో భక్తులు, స్థానికులు మండపాన్ని సందర్శించి ప్రత్యేకంగా దర్శించుకుంటున్నారు.