హైదరాబాద్: 28°C
తెలంగాణ

నర్సంపేటలో ప్రజాపాలన దినోత్సవం

WGL: నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 1948 సెప్టెంబర్ 17న సర్దార్ పటేల్ సైనిక చర్యతో హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీలక్ష్మి, వైస్ చైర్మన్ నరేందర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.