JN: బచ్చన్నపేట మండలంలోని రామచంద్రపూర్ గ్రామ శివారులో గురువారం కరెంట్ షాక్‌కు గురై అజయ్ (26) అనే యువకుడు మృతి చెందాడు. వ్యవసాయ క్షేత్రంలో విద్యుత్ సమస్యను రిపేర్ చేసేందుకు వెళ్లిన అజయ్ ప్రమాదవశాత్తు విద్యుత్ వైరు తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి, దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: కరెంట్ షాక్‌తో యువకుడి మృతి


