హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమరవీరుల స్థూపం వద్ద విజయలక్ష్మి నివాళి

WGL: ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా గురువారం ఖిలా వరంగల్‌ మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్‌పర్సన్ విజయలక్ష్మి, జిల్లా కలెక్టర్ సత్య శారద దేవి, డీసీసీ అంకిత్ కుమార్, తదితరులతో కలిసి అమరవీరులకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.