హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్నవరం స్వామిని దర్శించిన మంత్రి

KKD: శంఖవరం మండలం అన్నవరంలోని శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారిని పాండిచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు గురువారం దర్శించుకున్నారు. ముందుగా దేవస్థానం ఈఓ చక్రధర్‌రావు ఆధ్వర్యంలో సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా, ఆలయ సిబ్బంది స్వామివారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు.