హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

19న గ్రూప్-1 అభ్యర్థులకు అవగాహన

KDP: గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా పులివెందుల మున్సిపల్ కమిషనర్ తనూజ ఆధ్వర్యంలో 19న ఉదయం 11 గంటలకు మున్సిపల్ ఆఫీస్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. పరీక్షలకు సమర్థవంతంగా ఎలా సిద్ధం కావాలి, ప్రిపరేషన్లో పాటించాల్సిన సూచనలు, సమయపాలన, తదితర అంశాలపై కమిషనర్ తన అనుభవాలను అభ్యర్థులతో పంచుకోనున్నారు.