హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

ములుగు మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఆసియా షాహిన్ రియాజ్ మీర్జా జాతీయ జెండాను ఆవిష్కరించగా, జాతీయ, తెలంగాణ గీతాలను ఆలపించారు. ప్రజల భాగస్వామ్యంతో పారదర్శక, జవాబుదారీ పాలన అందించడమే లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో చైర్‌పర్సన్ చంద్రకళ బిక్షపతి, కమిషనర్ సంపత్, కౌన్సిలర్లు ఉన్నారు.