హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖమ్మం మార్కెట్‌లో స్వల్ప ధరల పెరుగుదల

KMM: వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి, పత్తి క్రయవిక్రయాలు గురువారం కొనసాగాయి. నాణ్యతను బట్టి ఏసీ మిర్చి క్వింటాకు రూ.23,125, నాన్‌ఏసీ రకం రూ.16,500 ధర పలికింది. పత్తిలో పాత రకం రూ.9,200, కొత్త పత్తి రూ.9,011గా నమోదైంది. గత రోజు కంటే ఏసీ మిర్చికి రూ.125, కొత్త పత్తికి రూ.100 అదనంగా ధర లభించింది. రెండు రకాల ధరల్లో మార్పు కనిపించలేదు.