హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం..!

MHBD: డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ వాహనంలో పవర్‌బ్యాంక్ పేలి మంటలు చెలరేగడంతో తృటిలో ప్రమాదం తప్పింది. గురువారం మహబూబాబాద్‌లో విమోచన దినోత్సవ కార్యక్రమానికి వెళ్తుండగా చింతపల్లి గ్రామ పరిసరాల్లో ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. భద్రతా సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మరో వాహనంలో మహబూబాబాద్‌కు వెళ్లారు.