హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఉపాధ్యాయుడిని నియమించాలని ధర్నా

MHBD: బయ్యారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో సోషల్ సబ్జెక్టు ఉపాధ్యాయుడిని నియమించాలని కోరుతూ పదో తరగతి విద్యార్థినులు గురువారం ఆందోళన చేపట్టారు. మూడు సంవత్సరాలుగా సోషల్ ఉపాధ్యాయుడు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నా ఉపాధ్యాయుడిని నియమించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.