BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో గురువారం కళ్యాణ వేడుకను ఆలయ పండితులు వైభవంగా నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ తలుపులు తెరిచి రామయ్యకు సుప్రభాత సేవ, ఆరాధనను శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం సీతారామలక్ష్మణులను మిథిలా స్టేడియంలో కొలువుదీర్చి వేద మంత్రాల నడుమ కల్యాణ ఘట్టాన్ని పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
వైభవంగా రాములవారి నిత్య కళ్యాణం..


