హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

BDK: భద్రాచలం మండలం వెంకటాపురంలో సీఎంఆర్‌ఎఫ్ కింద మంజూరైన 13 చెక్కులను గురువారం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు లబ్ధిదారులకు అందజేశారు. మొత్తం రూ.4.92 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అనారోగ్యంతో వైద్య చికిత్స పొందిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.