SS: కనగానపల్లి మండలం తల్లిమడుగులలో బుధవారం వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. చవితి సందర్భంగా ప్రతిష్ఠించిన గణనాథుడి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం నిమజ్జనం చేశారు. యువతీ, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో స్వామివారికి వీడ్కోలు పలికారు.
ఆంధ్రప్రదేశ్
గణపతి బప్పా మోరియా నినాదాలతో వీడ్కోలు


