NLR: సంగం మండలం సిద్దిపురం గ్రామంలో యువత ఆధ్వర్యంలో వినాయక మండపాన్ని నిర్మించి బాల గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు 2,000 అరటిపళ్లతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ అలంకరణ భక్తులను ఆకట్టుకుంది. అరటిపళ్ల అలంకరణను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
2 వేల అరటిపళ్లతో బాల గణేష్ అలంకరణ


