SDPT: బెజ్జంకి మండల కేంద్రంలోని చారిత్రక బురుజు నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుతోంది. బురుజుపై చెట్లు, పిచ్చిమొక్కలు పెరగడంతో నిర్మాణం దెబ్బతింటోంది. గోడలు బలహీనపడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చారిత్రక గుర్తింపును కాపాడేందుకు బురుజుకు మరమ్మతులు చేపట్టి పరిరక్షించాలని కోరుతున్నారు.
తెలంగాణ
శిథిలావస్థకు చేరిన బెజ్జంకి బురుజు


