ASR: జీకేవీధి మండలం సీలేరు పోలీస్ స్టేషన్‌ను గురువారం చింతపల్లి డీఎస్పీ తిరుపతిరావు తనిఖీ చేశారు. ముందుగా స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. వినాయక చవితి పండుగ సందర్భంగా తీసుకున్న జాగ్రత్తలు గురించి ఎస్సై ఎండీ యాసిన్‌ను అడిగి తెలుసుకున్నారు. అలాగే త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి పలు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
సీలేరు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన DSP


