MNCL: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా మున్సిపల్ చైర్ పర్సన్, దావ స్వాతి జాతీయ పతాకవిష్కరణ గావించారు. అనంతరం కార్యాలయం ఆవరణలో మహనీయుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
మున్సిపల్‌లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు


