హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

బ్రేక్ ఫాస్ట్ ఆలస్యంగా చేస్తున్నారా..?

ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసే సమయం మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే ఆలస్యంగా బ్రేక్ ఫాస్ట్ చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఆలస్యంగా తినడం వల్ల జీవక్రియ మందగించి బరువు పెరిగే ప్రమాదం ఉంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు అసమతుల్యత ఏర్పడి, రోజంతా నీరసంగా అనిపిస్తుంది. సరైన సమయానికి అల్పాహారం తీసుకోవడం జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది.