హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామాయంపేటలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం

MDK: రామాయంపేట మున్సిపల్ కార్యాలయంలో సెప్టెంబర్ 17 ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కమిషనర్ ఏ. రవీందర్ ఆధ్వర్యంలో, మున్సిపల్ ఛైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్‌పర్సన్ పోచమ్మల నవనీత గణేష్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.