హైదరాబాద్: 28°C
తెలంగాణ

మానవత్వం చాటిన ఇంటి యజమాని

SRCL: చందుర్తి మండలం ఎన్గల్‌కు చెందిన బత్తుల రామస్వామి వేములవాడలోని సుబ్రహ్మణ్యం నగర్‌లో బీజేపీ సీనియర్ నాయకుడు కనికరపు రాజయ్య ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. రామస్వామి గుండెపోటుతో మృతి చెందగా, ఇంటి యజమాని రాజయ్య మానవత్వంతో స్పందించారు. మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచేందుకు కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించి, అండగా నిలిచారు.