తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం గోకులాపురంలోని శ్రీ వినాయక స్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలోకి చొరబడిన దుండగులు హుండీ పగలగొట్టి నగదును దోచుకెళ్లారు. ఈ దొంగతనం దృశ్యాలు ఆలయ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
గోకులాపురం ఆలయంలో చోరీ


