హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతు ఇంట్లో భారీగా నగదు చోరీ

ATP: ఉరవకొండలో రైతు మాదినేని శ్రీనివాసులు ఇంట్లో భారీ చోరీ జరిగింది. కొత్త ఇల్లు, కుమారుడి వివాహం కోసం దాచుకున్న రూ.45 లక్షల నగదును దొంగలు అపహరించారు. భార్యను తీసుకొచ్చేందుకు శ్రీనివాసులు బళ్లారికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటి ప్రధాన ద్వారం ధ్వంసమై ఉంది. ఫిర్యాదు మేరకు సీఐ మహానంది సిబ్బందితో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించారు.