హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుండూర్‌లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం

NGKL: ఈ రోజు జాతీయ సమైక్యతా దినోత్సవం, ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా కల్వకుర్తి మండలంలోని గుండూర్‌లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పోతరపల్లి వెంకటయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ సమైక్యత, ప్రజాస్వామ్య విలువలు, దేశ సమగ్రతపై నాయకులు మాట్లాడారు.