హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్వాతంత్ర్య పోరాటంలో బోవేరా కీలక పాత్ర

SDPT: బెజ్జంకి మండలం తోటపల్లికి చెందిన బోయినపల్లి వెంకటరామారావు (బోవెరా) చిన్ననాటి నుంచే స్వాతంత్ర్యోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1920 సెప్టెంబర్‌ 2న జన్మించిన ఆయన ఆర్యసమాజ్‌ ప్రభావంతో మత ఛాందసవాదానికి వ్యతిరేకంగా పోరాడారు. 1942 క్విట్‌ ఇండియా ఉద్యమంలో 40 మంది జాతీయవాదులను సమీకరించి ఉద్యమాన్ని విస్తరించారు. గిడ్డంగులపై దాడులు చేసి బియ్యం పేదలకు పంచారు.