హైదరాబాద్: 28°C
తెలంగాణ

సున్నంబట్టి వాడలో హడలెత్తించిన నాగుపాము

MNCL: మంచిర్యాలలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి సున్నంబట్టి వాడ ప్రాంతంలో నాగుపాము గంటకుపైగా స్థానికులను హడలెత్తించిన ఘటన చోటు చేసుకుంది. పాము బుసలు కొట్టడంతో స్థానికులు భయాందోళన చెందారు. భారీగా జనం చేరడం వల్ల పాము గంట పాటు ఎటు వెళ్లలేకపోయింది. చివరకు పామును పట్టే వాళ్లకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని దాన్ని పట్టుకున్నారు.