హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేద కుటుంబానికి జనసేన అండ

ATP: ప్రమాదవశాత్తు మృతి చెందిన జనసైనికుడు అరుణ్ కుమార్ కుటుంబానికి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రూ.5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ సహాయానికి సంబంధించిన చెక్కును అనంతపురం జిల్లా జనసేన అధ్యక్షుడు, అహుడా ఛైర్మన్ టీసీ వరుణ్ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. కష్టాల్లో ఉన్న జనసైనికుల కుటుంబాలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నాయకులు తెలిపారు.