హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీశైలం జలాశయంలో తగ్గుతున్న నీటిమట్టం

NDL: శ్రీశైలం జలాశయం నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. గురువారం ఉదయం 6 గంటలకు ఇన్‌ఫ్లో నిల్‌గా నమోదైంది. ఎడమగట్టులో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 13,184 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నీటిమట్టం 861.10 అడుగులు, నీటి నిల్వ 109.54 టీఎంసీలుగా ఉంది.