హైదరాబాద్: 28°C
క్రీడలు

IND Vs AFG: నేడే ఆఖరి టీ20

భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడో టీ20 మ్యాచ్ ఇవాళ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇప్పటికే భారత్ 2-0తో కైవసం చేసుకుంది. ఈరోజు మ్యాచ్‌లో గెలిచి క్లీన్‌స్వీప్ చేయాలని టీమిండియా పట్టుదలగా ఉండగా, చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని ఆఫ్ఘనిస్తాన్ భావిస్తోంది.