NLR: బోగోలు మండలం బిట్రగుంట పరిధిలోని శ్రీ వెంకటేశ్వరపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు కాసేపు నిలిచిపోయింది. బిట్రగుంట నుంచి విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు చక్రం వద్ద అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. రైల్వే ఉద్యోగి గుర్తించి అధికారులకు సమాచారం ఇవ్వడంతో రైలును నిలిపివేశారు. పరిశీలన అనంతరం అధికారులు రైలును పంపించారు.
ఆంధ్రప్రదేశ్
గూడ్స్ రైలు చక్రం వద్ద మంటలు


