తిరుమల శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం క్యూ కాంప్లెక్స్‌లోని 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. కాగా, నిన్న ఒక్కరోజే 71,196 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 22,581 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించగా.. హుండీ ఆదాయం రూ.2.46 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.
భక్తి
తిరుమలలో సర్వదర్శనానికి 4 గంటలు


