హైదరాబాద్: 28°C
తెలంగాణ

అండర్-16 క్రికెట్ పోటీలలో కార్తికేయ సత్తా

KMR: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆధ్వర్యంలో జరుగుతున్న అండర్-16 క్రికెట్ పోటీల్లో కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన కార్తికేయ అద్భుత ప్రతిభ కనబరిచాడు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జట్టు తరఫున బరిలోకి దిగిన ఆయన తొలి రౌండ్‌లోనే అద్భుత బౌలింగ్‌తో ఏడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. కార్తికేయ ప్రతిభను కోచ్ రియాజుద్దీన్ అభినందించారు.