హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జన ప్రదేశాన్ని పరిశీలించిన అడిషనల్ ఎస్పీ

NLG: వేములపల్లి మండల కేంద్రంలోని నాగార్జునసాగర్ ఎడమ కాలువ వద్ద వినాయక నిమజ్జన ప్రదేశాన్ని నిన్న సాయంత్రం అడిషనల్ ఎస్పీ రమేష్ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక నిమజ్జన కార్యక్రమాలలో డీజేలను వినియోగించవద్దని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, నిర్వహకులు ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలన్నారు.