హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా నిమజ్జనం'

E.G: నేటి నుంచి వినాయక నిమజ్జనాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రాణనష్టం జరగకుండా ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించుకోవాలని సీతానగరం ఎస్సై ఎల్. శ్రీనివాస్ నాయక్ సూచించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా సాయంత్రం 5 గంటల్లోపు నిమజ్జనాలు పూర్తి చేయాలన్నారు. ఊరేగింపుల్లో డీజే, తీన్మార్ డప్పులకు అనుమతి లేదని స్పష్టం చేశారు.