హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్లంపల్లిలో నీటిమట్టం వివరాలు

PDPL : శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో గురువారం ఉదయం 6 గంటలకు 18.9806 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి సామర్థ్యం 20.1754 టీఎంసీలు కాగా, నీటిమట్టం 147.57 మీటర్లుగా నమోదైంది. ఎగువ నుంచి 2,805 క్యూసెక్కుల వరద వస్తుండగా, హెచ్ఎండబ్ల్యూఎస్‌కు 240 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 62 గేట్లు మూసి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.