హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రహదారిపై కొండచిలువ హల్‌చల్

WGL: వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి క్రాస్‌రోడ్డు సమీపంలోని వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున సుమారు 8 అడుగుల పొడవైన కొండచిలువ కనిపించింది. రోడ్డును దాటుతున్న కొండచిలువను గమనించిన వాహనదారులు వాహనాలను నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని కొండచిలువను ఆసక్తిగా తిలకించారు.