BHPL: మొగుళ్లపల్లి మండలంలోని ములకలపల్లి చిన్నవాగు బ్రిడ్జి వద్ద గుంతలమయంగా మారిన రహదారికి బుధవారం రాత్రి మరమ్మతులు చేపట్టారు. ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించిన ఎస్సై సురేశ్ చొరవతో డోజర్ సహాయంతో గుంతలను పూడ్చి రహదారిని ప్రయాణానికి అనుకూలంగా మార్చారు. దీంతో వాహనదారులు ఎస్సై సురేశ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
VIDEO: ఎస్సై చొరవతో రహదారి మరమ్మతులు..


