హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొమురవెల్లి మల్లికార్జున స్వామి దివ్యదర్శనం

SDPT: ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న సన్నిధికి ఇవాళ భక్తులు పోటెత్తారు. కోరిన కోరికలు తీర్చే స్వామివారు నేడు విశేష అలంకరణలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. ఈ పవిత్ర దినాన స్వామి దర్శనం శుభప్రదమని భావించిన భక్తులు వేకువజాము నుంచే ఆలయానికి తరలివచ్చి పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.