హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధిక శబ్దంతో డీజేలు.. ముగ్గురిపై కేసులు

ADB: ఆదిలాబాద్ రూరల్ మండలం లాండసాంగ్వి గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దంతో ఏర్పాటు చేసిన మూడు డీజేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీజే యజమానులు బొట్టు సంతోష్, సాయి చరణ్, షేక్ అమీర్లపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ విష్ణువర్ధన్ తెలిపారు. గణేశ్ నిమజ్జనంలో డీజేలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కమిటీ సభ్యులపైనా కేసులు నమోదు చేస్తామన్నారు.