హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలజ్ గణేష్ దర్శనానికి ప్రత్యేక బస్సులు

NRML: వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం నిర్మల్, భైంసా డిపోల నుంచి మహారాష్ట్రలోని పాలజ్ కర్ర గణపతి ఆలయానికి ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అదనపు బస్సులను నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు, భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.