HNK: విద్యార్థినిపై అనుచితంగా ప్రవర్తించిన బైక్ మెకానిక్‌పై బుధవారం కేయూ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ రవికుమార్ బుధవారం తెలిపారు. భీమారంలోని ఓ విద్యాసంస్థలో బాలికపై అనుచితంగా ప్రవర్తించడంతో పాటు మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
విద్యార్థినిపై అనుచిత ప్రవర్తన.. పోక్సో కేసు


