హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇద్దరు యువకులపై పోక్సో కేసులు..

MHBD: బయ్యారం మండలంలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు యువకులపై పోక్సో కేసులు నమోదైనట్లు ఎస్సై ప్రశాంత్‌బాబు బుధవారం తెలిపారు. ఓ ఘటనలో మైనర్ బాలికతో సహజీవనం చేస్తున్న బాలుడిపై ఐసీడీఎస్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మరో ఘటనలో మైనర్ బాలికను వివాహం చేసుకున్న యువకుడిపై కేసు నమోదైంది. బాలికలను జిల్లా బాలికల సంరక్షణ కేంద్రాలకు తరలించారు.