KNR: శంకరపట్నం మండల పరిషత్ కార్యాలయంలో జరగాల్సిన గ్రామాభివృద్ధి సమీక్షా సమావేశం అనివార్య కారణాలతో వాయిదా పడినట్లు ఎంపీడీవో అనిత తెలిపారు. ఈ సమావేశాన్ని రేపు ఉదయం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గ్రామాల్లో అభివృద్ధి పనుల పురోగతి, ప్రభుత్వ పథకాల అమలు, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలు, వ్యవసాయ రంగ పరిస్థితులపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
రేపు గ్రామాభివృద్ధి సమీక్ష


