హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆధునిక రుగ్మతలకు చిరుధాన్యాలే ఔషధం: కలెక్టర్

ADB: సిరికొండ మండలం నారాయణపూర్‌లో ‘ఆదివాసీ ఆహార వైభవం’ సదస్సు బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ.. ఆధునిక ఆరోగ్య సమస్యలను అధిగమించేందుకు సంప్రదాయ ఆహారపు అలవాట్లు, చిరుధాన్యాల వినియోగం ఎంతో అవసరమన్నారు. అనంతరం పోషకాహార స్టాళ్లను పరిశీలించి, గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.